ఈ ఫొటోలో కన్పిస్తున్న వారు హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కంసాని దేవేందర్‌రెడ్డి భార్య లక్ష్మి, కుమారుడు ప్రదీప్‌రెడ్డి. మార్చి 21న ఐకేపీ సెంటర్‌లో వడ్లు నేర్పి ఇంటికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో ప్రమాదవశాత్తు మరణించారు. వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు రూ. 15 లక్షల అప్పు చేశారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బీమా డబ్బులు వస్తే కొంత అప్పులు తీర్చుకోవచ్చు అని కుటుంబం ఎదురుచూస్తోంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పిట్ల సుగుణ. మిరుదొడ్డి గ్రామానికి చెందిన మహిళ. గత నెల 25న అనారోగ్యంతో భర్త మృతి చెందాడు. రైతు బీమా కోసం వ్యవసాయ అధికారులకు అన్ని ధ్రువపత్రాలను అందజేసింది. ఇప్పటివరకు బీమా డబ్బులు అకౌంట్‌లో జమ కాలేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా బీమా డబ్బులు ఇప్పించాలని కోరుతుంది.


