శాపంగా మారిన యూరియా యాప్‌ | - | Sakshi
Sakshi News home page

శాపంగా మారిన యూరియా యాప్‌

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

గజ్వేల్‌: యూరియా యాప్‌ రైతులకు శాపంగా మారిందని, దానిని వెంటనే రద్దు చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేటికీ రైతులకు సెల్‌ఫోన్‌ వాడకం సక్రమంగా తెలియదన్నారు. వారు యాప్‌ను ఎలా వాడగలుగుతారని ప్రశ్నించారు. రైతుల అవసరంమేరకు యూరియా పంపిణీ చేయడం చేతగాక.. యాప్‌ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మహత్యల బారిన పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవటం లేదని, ఈ పరిస్థితుల్లో హల్దీ, కుడ్లేరు వాగులతోపాటు కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌ కాల్వలకు గోదావరి జలాలను వదలాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చందన, బీఆర్‌ఎస్‌ నాయకులు నవాజ్‌మీరా, మధు, కల్యణ్‌కర్‌ నర్సింగరావు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌, కనకయ్య, రాజు, రహీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement