సిద్దిపేటకమాన్: కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని, రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, అదనపు న్యాయమూర్తి జయప్రసాద్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు పలు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో 5,420 క్రిమినల్, 27సివిల్ కేసులతో పాటు మొత్తం 5,447 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సంతోష్‌కుమార్, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, కాంతరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడిషనల్ డీసీపీ కుశాల్కర్, ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు మహేందర్‌రెడ్డి, మురళి, లక్ష్మీబాబు, విద్యాసాగర్, ముత్యంరాజు, సీనియర్ న్యాయవాదులు సత్యనారాయణ, రామకృష్ణ, పత్రి ప్రకాష్, దేవునూరి రవిందర్, రాజలింగం, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో
5,447 కేసులు పరిష్కారం


