నాచగిరిలో వ్రతమాచరిస్తున్న దంపతులు
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవునివ్రత శోభతో అలరారింది. క్షేత్రానికి హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు, కల్యాణాలు, సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ రంగాచారి జాగ్రత్తలు తీసుకున్నారు.


