సీపీ సాధన రష్మీ పెరుమాళ్
దుబ్బాకటౌన్: కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, నిర్ణీత సమయంలో కోర్టుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ఆదేశించారు. శుక్రవారం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన వార్షిక తనిఖీల్లో భాగంగా ఆమె పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌న్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల పరిస్థితిని సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన దర్యాప్తు ద్వారానే బాధితులకు న్యాయం చేకూరుతుందన్నారు. సీసీటీఎన్‌ఎస్–2.0, టీజీ–కాప్, సైబర్ క్రైమ్ పోర్టల్ తదితర సాంకేతిక వ్యవస్థల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ అరుణ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
‘నీట్’కు పకడ్బందీగా నిబంధనలు అమలు..
సిద్దిపేటకమాన్: నెల 21న జరగనున్న నీట్ పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్ష జరగనున్న సమయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రానికి 500 మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదన్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.


