సిద్దిపేటజోన్: విజయవాడ కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం తరహాలో సిద్దిపేట గోదారి నీటిలో ఘనంగా హనుమాన్ తెప్పోత్సవం జరగడం ఆనందంగా ఉందని, సిద్దిపేట తెప్పోత్సవానికి నెలవుగా మారిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోమటిచెరువులో వైభవంగా హనుమాన్ తెప్పోత్సవం నిర్వహించారు. అంతకుముందు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో హనుమాన్ విగ్రహప్రతిమతో చెరువులో కలియ తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. హనుమాన్ మాల ధారణ విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ తెప్పోత్సవం భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అంజన్న దయతో సిద్దిపేటకు కాళేశ్వరం ద్వారా గోదారి నీరు వచ్చిందన్నారు.
సమష్టి కృషితోనే 22 అవార్డులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే, సిద్దిపేట మున్సిపాలిటీకి 22 అవార్డులు వచ్చా యని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సరిత, రాములు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో మంచి పని చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం, రాములు, ఎల్లయ్య, నర్సింహులు, సతీశ్, శ్రీహరి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు
కోమటిచెరువులో ఘనంగా తెప్పోత్సవం


