మాట్లాడుతున్న సునీతారెడ్డి. చిత్రంలో
శివాచార్య స్వామిజీ
జహీరాబాద్ టౌన్: సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆదివారం నిర్వహించి హిందూ సమ్మేళనానికి ఆమె హాజరై మాట్లాడారు. గడప దాటితే అందరం హిందువులని, కుల,మత భేదాలను వీడి అందరూ ఒక్కటికావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి చెబుతుండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
వీహెచ్‌పీ ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి


