మద్దూరు(హుస్నాబాద్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని, రైతులను ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని సలాఖపూర్ గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన మిల్లుకు తరలించాలని సిబ్బందికి సూచించారు. సెంటర్‌లో ప్యాడీ క్లీనర్లు చెడిపోతే వెంటనే రిపేర్ చేయించాలన్నారు. మిల్లుల్లో జాప్యం కాకుండా ఒక సెంటర్‌కు రెండు లేదా మూడు మిల్లులను కేటాయించాలని సివిల్ సప్లయి అధికారులను ఆమె ఫోన్‌లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి


