ఆధ్యాత్మిక తరంగం
గిరి ప్రదక్షిణలో భక్తజన సందోహం
స్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి అలరారింది. నృసింహ నామంతో మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. శుక్రవారం ఉదయం పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆలయ ఉత్తర ద్వారం వద్ద ‘గిరి’ ప్రదక్షిణ ప్రారంభించారు. నాచగిరి కొండలు చుడుతూ, హరిద్రానది తీరం దాటుతూ, గోశాల మీదుగా ఉత్తరద్వారం వరకు కొనసాగిన గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారిని దర్శించుకుని తరించారు.
– వర్గల్(గజ్వేల్)


