జిల్లా సంక్షేమశాఖ అధికారి శారద
సిద్దిపేటరూరల్: అందమైన కుటుంబం ఏర్పాటు కోసం చట్టబద్ధంగా చిన్నారుల దత్తత చక్కని మార్గమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో మిషన్ వాత్సల్య పథకం– డీసీపీయూ విభాగం ఆధ్వర్యంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చట్టబద్ధ దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవడానికి గల అర్హతలు, సంబంధిత వివరాలను తెలియజేస్తూ దరఖాస్తుచేసుకోవాలన్నారు. చట్టబద్ధంగా కాకుండా అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోరాదన్నారు. అనంతరం దత్తత తీసుకున్న తల్లితండ్రులకు అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ మమత, డీసీపీఓ రాము, బాలల రక్షణ అధికారులు పాల్గొన్నారు.


