సెలవుల్లో ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు, విహారయాత్రలకు వెళ్లేవారు ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాంకు లాకర్లులో భద్రపర్చుకోవాలని తెలిపారు. ప్రయాణ వివరాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్‌ 100 లేదా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా ఈత కోసం చెరువులు, కుంటల, లోతైన నీరు ఉన్న ప్రాంతాలకు పంపకూడదన్నారు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement