కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

నలుగురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే అభినందనలు

దుబ్బాక: మున్సిపల్‌ కో ఆప్షన్‌ మెంబర్ల ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. చైర్‌పర్సన్‌ శ్రీరాం సంగీత ఆధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. మైనార్టీ కోటాలో ఎండీ.ఖలీల్‌, నసీమా, పాలన అనుభవం కోటాలో ఆస యాదగిరి, గోనె దేవలక్ష్మి ఎన్నికయ్యారు. కో ఆప్షన్‌ సభ్యుల కోసం మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. కో ఆప్షన్‌ మెంబర్ల ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్‌ సమావేశానికి కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మొత్తం కౌన్సిల్‌లో 20 మంది సభ్యులకు గాను బీఆర్‌ఎస్‌ చెందిన వారు 14 మంది ఉండటంతో కో ఆప్షన్‌ మెంబర్లను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచన మేరకు ఎన్నుకున్నారు. ఎన్నికై న నలుగురు కో ఆప్షన్‌ మెంబర్ల చేత ఎలక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారం చేపించారు. కో ఆప్షన్‌ ఎన్నిక సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరై ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్‌ అభివృద్ధికి భాద్యతయుతంగా పనిచేయాలని కో ఆప్షన్‌ మెంబర్లకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement