గతంలో మాదిరిగానే ధాన్యం కొనాలంటూ ధర్నా
సిద్దిపేటఅర్బన్: గతంలో మాదిరిగా ధాన్యాన్ని జల్లి పట్టకుండానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ధాన్యం జల్లి పట్టడానికి యంత్రాలు లేవని, గతంలో మాదిరిగానే తాలుకు తరుగు తీసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ధాన్యాన్ని జల్లి పట్టిన తరువాతే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు. తాలు తీయకుండా కొనుగోలు చేసే పరిస్థితి లేదని తెలిపారు.


