దుబ్బాక: వైద్యసేవల్లో రాష్ట్రంలోనే గొప్ప ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక వంద పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎల్వీ ప్రసాద్ యాజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే మోకాలు చిప్పల మార్పిడిపై వాటికి సంబంధించిన ఆపరేషన్ పరికరాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రి చుట్టూ ప్రహరీ, పోస్టు మార్టమ్ రూమ్ వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ కొత్తగా నిర్మించడం, రోగులకు అవసరమయ్యే పరికరాల కొనుగోలు తదితర విషయాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఆస్పత్రిలో అన్ని రకాల ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. నార్మల్ డెలవరీలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ సంగీత, వైస్ చైర్‌పర్సన్ ఆస సులోచన, కౌన్సిలర్ దేవుని రాజు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ అన్నపూర్ణ, ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ అరుణ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక ఆస్పత్రి
అభివృద్ధి కమిటీ సమావేశం


