ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ముఖ్యం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

గజ్వేల్‌: ఆర్‌టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌–ప్రజాపూర్‌ ఆర్‌టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్‌టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్మికుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో గజ్వేల్‌ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

రేవంత్‌, పొన్నం చిత్రపటాలకు

క్షీరాభిషేకం

Advertisement
 
Advertisement
Advertisement