స్వీయగణనలో భాగస్వాములు కండి.. | - | Sakshi
Sakshi News home page

స్వీయగణనలో భాగస్వాములు కండి..

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

దుబ్బాక: స్వీయగణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌కుమార్‌అన్నారు. జనగణనలో భాగంగా ఆదివారం చైర్‌పర్సన్‌ శ్రీరాం సంగీత స్వీయగణనలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల్లో భాగంగా స్వీయగణనలో తొలిరోజునే కౌన్సిలర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారన్నారు.

ఫుట్‌బాల్‌ పోటీల్లో రాణించాలి

గజ్వేల్‌రూరల్‌: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గణేశ్‌ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్‌లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్‌ టాగోర్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులు అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్‌ఐఎస్‌ కోచ్‌ నరసింహ, జీఎఫ్‌సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యంపై దృష్టిసారించాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి

హుస్నాబాద్‌: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. తినే ఆహారంలో పప్పు దినుసులు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కార్మికులు పాల్గొన్నారు.

మహనీయులను మరవొద్దు

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య

మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్‌ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవడం శుభపరిణామమన్నారు. మహనీయులు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్‌లో చేపట్టిన బృహత్‌ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, కార్మిక కర్షకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిమ్మాపూర్‌ సర్పంచ్‌ శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ ఆస యాదగిరి, మాజీ సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement