న్యూస్‌రీల్
రైతుల కష్టం ఎండలకు ఆవిరైపోతోంది.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. పలు చోట్ల కుంటలు, చెరువులలో నీళ్లు లేక నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ భోరుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. యాసంగి పంటలకు తడి అందక రైతులకు గుండె తడే మిలిగిస్తున్నది. మూడు తడులు పారిస్తే చేతికొస్తదనుకున్న పంటల కోసం తిప్పలపడుతున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని రైతులు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్లు, చెరువులు, ఇతర బావుల నుంచి నీటిని తరలించి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
– సాక్షి , సిద్దిపేట


