కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మహిపాల్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మహిపాల్‌రెడ్డి

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

బెజ్జంకి(సిద్దిపేట): కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని దేవక్కపల్లెకు చెందిన కరివేద మహి పాల్‌రెడ్డిని నియామకం అయ్యారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌, స్టేట్‌ చీఫ్‌ రామచంద్రారావుకు కృతజ్ఞతలు తెలిపారు.

అవగాహనతోనే

మలేరియా అంతం

సిద్దిపేటకమాన్‌: అవగాహనతోనే మలేరియా ను అంతం చేయవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మలేరియాకు ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ శ్రీకాంత్‌ యాదవ్‌, డాక్టర్‌ వినోద్‌బాబ్జి, డాక్టర్‌ దీప్తి ప్రియాంక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమ్మర్‌ క్యాంపులతో

మానసిక వికాసం

కొండపాక(గజ్వేల్‌): వేసవి శిబిరాలు విద్యార్థుల మానసిక వికాశానికి దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి ముండ్రాతి రమేశ్‌ అన్నారు. కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం ఆయన సమ్మర్‌ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఈ సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ఆంగ్లంపై పట్టుసాధించడం, చేతిరాత తదితర అంశాల్లో శిక్షణనిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, పీఎన్‌ఆర్‌ ట్రస్టు నిర్వాహకుడు పొల్కంపల్లి నరేందర్‌, సీఆర్పీ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్లికార్జునుడికి

హైకోర్జు జడ్జి పూజలు

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసా దం, శేషవస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌, చేర్యాల న్యాయమూర్తి తరుణి, సీఐ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే ఆర్వోబీ పనులు

చేగుంట(తూప్రాన్‌): మండల కేంద్రంలోని రైల్వేగేట్‌ను శనివారం రైల్వే డిప్యూటీ ఇంజనీర్‌ నూరొద్దీన్‌ హబీబ్‌ సందర్శించారు. ఈసందర్భంగా రైల్వే గేటు వద్ద నిర్మించే ఆర్వోబీ గురించి కాంట్రాక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రైల్వే గేటును మూసివేసి ఆర్వోబీ పనులు నిర్వహిస్తామన్నారు. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ దారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఇంజనీర్లు సమీర్‌, జగదీశ్‌తో పాటు రైల్వే సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement