జాబ్‌ మేళాకు అనూహ్య స్పందన | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ మేళాకు అనూహ్య స్పందన

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించిన పోలీస్‌ ఉద్యోగ మిత్ర మెగా జాబ్‌ మేళాకు అనూహ్య స్పందన లభించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. జాబ్‌ మేళాలో 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో అభ్యర్థులకు ఎంపిక చేశారన్నారు. మొత్తం 2 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇంటర్వ్యూ అనంతరం 624 మందిని ఎంపిక అయినట్లు చెప్పారు. కాగా జాబ్‌మేళాలో మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుని విశాఖపట్టణం నుంచి ఆరుగురు అభ్యర్థులు వచ్చారు. వారిని గుర్తించిన గౌరారం ఎస్‌ఐ కరు ణాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఫార్మా కంపెనీ విభాగంలో ఇంటర్వ్యూకు పంపించగా, వారు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అనంతరం అభ్యర్థులకు సీపీ నియామక పత్రాలు అందజేశారు. పోలీస్‌శాఖ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ శ్రేయస్సులో భాగస్వామ్యం వహించడం తమ కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, ట్రైనీ ఐపీఎస్‌ ఆయేషా ఫాతిమా, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, సుమన్‌కుమార్‌, సీఐలు లక్ష్మీబాబు, వాసుదేవరావు, ఉపేందర్‌, లతీఫ్‌, ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు, పలు కంపెనీల హెచ్‌ఆర్‌లు తదితరులు పాల్గొన్నారు.

వివిధ ఉద్యోగాలకు 624 మంది ఎంపిక

Advertisement
 
Advertisement
Advertisement