బీడీ కార్మికులకు ‘సంజీవని శక్తి’ కిట్లు | - | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికులకు ‘సంజీవని శక్తి’ కిట్లు

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

దుబ్బాకరూరల్‌: మండలంలోని శిలాజీనగర్‌లో బీడీ కార్మికులకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక ‘సంజీవని శక్తి’ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాత్రనక పగలనక కష్టపడి పని చేసే బీడీ కార్మికుల ఆరోగ్యం బాగు కోసమే కిట్లు అందించినట్లు తెలిపారు. సంజీవని శక్తి కిట్‌లో క్యాల్షియం టాబ్లెట్లు, మిల్టీవిటమిన్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, పేయిన్‌ రిలీఫ్‌ జెల్‌, హెయిర్‌ ఆయిల్‌, దువ్వెన, స్టిక్కర్స్‌, కాజల్‌(కాటుక), కుంకుమ పసు పు, యాంటిసెప్టిక్‌ సబ్బు, నెయిల్‌ కట్టర్‌, హాట్‌ వాటర్‌ బ్యాగ్‌, గాజులు, ఛత్రం, కాటన్‌ బ్యాగ్‌ తదితర వస్తువులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement