ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో గురువారం కురిసిన వడగళ్ల వానతో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం జిల్లాలోని వడగళ్ల వాన కురిసిన ప్రాంతాలను జిల్లా, మండల, వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరి 398 ఎకరాల్లో, మొక్కజొన్న 2 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.
నష్టపోయిన రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఐదు సార్లు వడగళ్ల వాన, ఒకసారి తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నివేదిక ఆధారంగా పరిహారం చెల్లించాలన్నారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు వివిధ పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్, నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో అధికంగా పంట నష్టం వాటిల్లిందన్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ను హరీశ్‌రావు కోరారు.
వడగళ్ల వాన నష్టంపైప్రాథమిక అంచనా
క్షేత్రస్థాయిలో పరిశీలించినవ్యవసాయాధికారులు
అకాల వర్షాల బాధితులకుపరిహారం ఇవ్వాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు


