కో– ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

కో– ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది. నలుగురు సభ్యులకుగాను ఒకరు సీపీఎం, ముగ్గురు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. కమిషనర్‌ నాగేందర్‌ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. పరిపాలనలో అనుభవం కలిగిన కోటాలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు బరిలో ఉండగా వీరిలో ఇద్దరి నామినేషన్లు ఎన్నికల నిబందనల మేరకు తిరష్కరణకు గురయ్యాయి. దీంతో ముస్త్యాల నాగేశ్వర్‌రావు, యాట కనకవ్వలు ఎన్నికయ్యారు. మైనార్టీ కోటాలో సీపీఎం అభ్యర్థి ఇబ్రహీం, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెరీలమ్మ నామినేషన్లు వేయగా ఇద్దరూ ఎన్నికయ్యారు. పై నలుగురు కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికై నట్లు కమిషనర్‌ ప్రకటించారు. నూతనంగా ఎన్నికై న కో–ఆప్షన్‌ సభ్యుల చేత కమిషనర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement