హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. డిపో ఎదుట మహిళా కార్మికులు బతుకమ్మ ఆటపాటలతో నిరసన చేపట్టారు. ప్రైవేట్ బస్సులను నడిపే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు. బస్సులన్నీ నిలిచిపోవడంతో ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోయింది. కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్, బీఎస్పీ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, బీఆర్‌ఎస్, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


