అకాల వర్షాల వేళ అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షాల వేళ అప్రమత్తం

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని మర్రిముచ్చాల, గౌరయపల్లిలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ హైమావతి బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులు వరి కోతలు కోయగానే నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా పొలాల వద్ద ఆరబెట్టుకుని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పాలని కలెక్టర్‌ సూచించారు.

చేర్యాల(సిద్దిపేట): అకాల వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తేమ శాతం రాగానే లోడ్‌ చేయాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం తాడూరు, చిట్యాల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న రైతులతో కలెక్టర్‌ మాట్లాడారు. మిల్లులు కేటాయించలేదని పలువురు రైతులు తెలిపారు. వెంటనే ఏపీఎంకు ఫోన్‌ చేసి వారం క్రితమే మిల్లుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని, తేమశాతం వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాలు, కాంటాలు, ప్యాడీ క్లీనర్లు, తాగునీటి వసతి, అకాల వర్షాలు వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్‌ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మొత్తం 419 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ మొదలైందని కలెక్టర్‌ తెలిపారు.

కొనుగోలు కేంద్రాల పరిశీలన

తేమ శాతం రాగానే

ధాన్యాన్ని లోడ్‌ చేయండి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

Advertisement
 
Advertisement
Advertisement