భూసారం మేరకే ఎరువులు వాడాలి | - | Sakshi
Sakshi News home page

భూసారం మేరకే ఎరువులు వాడాలి

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): భూసార పరీక్షల ఆధారంగానే అవసరమైనంత ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు ప్రసాద్‌, సురేష్‌, పల్లవి సూచించారు. బుధవారం చిన్నకోడూరులో సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల, నీటి కాలుష్యం పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి ఖర్చు వృథా అవుతుందన్నారు. సేంద్రియ, జీవన ఎరువులను వినియోగించాలన్నారు. తద్వారా పంట పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందన్నారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ వంటివి వాడాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement