ఆర్టీసీలో సమ్మె సైరన్‌.. | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమ్మె సైరన్‌..

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

రైతులకు అండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్‌ అన్నారు. వివరాలు 8లో u .. అడుగంటిన జలాలు వాగుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలుజరుగుతుండటంతో భూగర్భ జలాలుఅడుగంటిపోతున్నాయి. వివరాలు 8లో u

న్యూస్‌రీల్‌

రైతులకు అండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్‌ అన్నారు. వివరాలు 8లో u
నేటి నుంచి కార్మికుల ఆందోళన ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సిద్దిపేటకమాన్‌: ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వ అధికారులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సిబ్బంది ముందుగా ప్రకటించిన విధంగా బుధవారం తెల్లవారుజాము నుంచే సమ్మె బాట పట్టనున్నారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021–25 వేతన సవరణ పేస్కేల్‌ అమలు చేయడం, ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించడం వంటి పలు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు.

నాలుగు డిపోల పరిధిలో..

జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌ –ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు 285 బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. సిద్దిపేట డిపోలో సుమారుగా 300మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. నాలుగు డిపోల పరిధిలో ఉద్యోగులు బుధవారం తెల్లవారుజాము నుంచే విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గోననున్నట్లు వారు ప్రకటించారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహించక తప్పడం లేదని పలువురు ఉద్యోగులు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌, రామాయంపేట, హుస్నాబాద్‌, కామారెడ్డి, వేములవాడ, జగిత్యాల వంటి పలు ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేవారు. కానీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు తిప్పలు తప్పే అవకాశం లేనట్లే. ఇదే అదునుగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసే అవకాశం ఉంది.

హుస్నాబాద్‌: డిపో ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

ఏర్పాట్లు చేస్తున్నాం

రెగ్యులర్‌ ఉద్యోగులు సమ్మెలో ఉంటే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో డ్రైవింగ్‌ వచ్చిన వారిని డ్రైవర్లుగా వినియోగించుకోనున్నాం. అద్దె బస్సులకు కండక్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు తిప్పడానికి ప్రయత్నిస్తాం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండి, 25నుంచి 35ఏళ్ల వయసు ఉండి డ్రైవింగ్‌ వచ్చిన వారిని డ్రైవర్లుగా, పదవ తరగతి పాసై 25నుంచి 35ఏళ్ల మద్య వయసు ఉన్న వారిని కండక్టర్లుగా తీసుకుని బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

– భవభూతి, సిద్దిపేట ఆర్టీసీ డీఎం

Advertisement
 
Advertisement
Advertisement