హుస్నాబాద్‌రూరల్: వడదెబ్బతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని పోతారం(ఎస్)లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కంసాని దేవేంద్రరెడ్డి (58) ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టారు. మూడు రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టిన క్రమంలో ఎండకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సమీప రైతులు హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, కొడుకు ప్రదీప్, కూతురు ఉన్నారు.
1 నుంచి సాంస్కృతిక
వారోత్సవాలు
గజ్వేల్‌రూరల్: మే 1 నుంచి 7 వరకు శ్రామిక సాంస్కృతిక వారోత్సవాలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య తెలిపారు. గజ్వేల్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ శ్రామికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


