సిద్దిపేటరూరల్: జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి ఈఅర్‌ఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా దాదాపు సిద్దిపేట 53 వేలు, గజ్వేల్ 33 వేలు, దుబ్బాక 21 వేలు, హుస్నాబాద్ 18 వేలు ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ పెండింగ్ ఉన్నందున వాటిని పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఓటర్ల వద్దకు వెళ్లి వెరిఫై చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా నియోజకవర్గాల ఈఅర్‌ఓలు మ్యాపింగ్ పక్కాగా జరిగేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియ కోసం ఒక టీంను వేసి ప్రణాళిక ప్రకారం యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీఓలు సదానందం, రామ్మూర్తి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం దిశగా ముందుకు సాగాలి
సిద్దిపేటరూరల్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదవాలని కలెక్టర్ కె. హైమావతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని తోర్నాలలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర పోస్టుమట్రిక్ వసతి గృహాన్ని కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వారోత్సవాలు నిర్వహణలో భాగంగా రోజువారి కార్యక్రమాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు.
కలెక్టర్ హైమావతి


