పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తాం

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తాం

వర్గల్‌(గజ్వేల్‌): ఎన్నికల్లో హామీ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి జూన్‌ 2లోపు 50శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని పీఆర్‌టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంగళవారం వర్గల్‌ మండలం నెంటూరులో పీఆర్‌టీయూ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన మైలారం జెడ్పీహైస్కూల్‌ హెచ్‌ఎం సుబ్రహ్మణ్యేశ్వర్‌రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పీఆర్సీ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు అని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు సుబ్రహ్మణ్యేశ్వర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌సీఈఆర్‌టీ మాజీ డైరెక్టర్‌ ఆనంద్‌ కిషోర్‌, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ఆదరాసుపల్లి శశిధర్‌శర్మ, మండల ప్రధాన కార్యదర్శి పారుపల్లి నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ రంగారెడ్డి, ఎంఈఓ సునీత, నాయకులు కరీమొద్దీన్‌, రామకృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement