వర్గల్(గజ్వేల్): అవార్డులు, రివార్డులు, పుస్తకావిష్కరణలతో యూనివర్సిటీ ఖ్యాతి ఇనుమడించిందని గౌరారం కావేరి యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ వీ. ప్రవీణ్‌రావు అన్నారు. మంగళవారం వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వప్రకాశ్‌బాబు రచించిన ‘ఏ టెక్స్ట్‌బుక్ ఆఫ్ జెనరలైజ్డ్ థీరీ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రంగంలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ఈ గ్రంథం ముఖ్యమైన శాసీ్త్రయ ఆధారంగా నిలుస్తుందన్నారు. కావేరి యూనివర్సిటీ ఇటీవల వివిధ సంస్థల ద్వారా మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బీ. శ్రీనివాసులు, డీన్లు ప్రతాప్‌కుమార్ రెడ్డి, కొండ శ్రీనివాస్, సునీత మెహతా, ప్రొఫెసర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


