వాటర్‌ షెడ్‌ పనులు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ షెడ్‌ పనులు భేష్‌

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

వాటర్‌ షెడ్‌ పనులు భేష్‌

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కమిషనర్‌

చిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని చౌడారం గ్రామంలో కొనసాగుతున్న వాటర్‌ షెడ్‌ పనులను మంగళవారం స్పెషల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపడుతున్న వాటర్‌ షెడ్‌ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలోని ఫార్మేషన్‌ రోడ్డు, మ్యాంగో ఆర్టికల్‌ ప్లాంటేషన్‌, నర్సరీ, ఆయిల్‌పామ్‌ తోటలను సందర్శించారు. గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జయదేవ్‌ ఆర్య, ఎంపీడీఓ జనార్దన్‌, ఏపీఓ శ్యాంసుందర్‌ రెడ్డి, అధికారులు, సర్పంచ్‌ వాసుదేవాచారి పాల్గొన్నారు.

రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement