అర్జీలు పునరావృతం కావొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కావొద్దు

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

అర్జీలు పునరావృతం కావొద్దు ప్రశాంతంగా ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు వసతి గృహాల పరిశీలన గ్యాదరి రాజారాంకు ‘ధర్మ యోధ’

అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను అధికారులు పరిష్కరించి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) లక్ష్మీతో కలిసి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ హమీద్‌ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్జీలను వెంటవెంటనే పరిష్కరించి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా భూ సంబంధిత, హౌసింగ్‌, ఆసరా పింఛన్లు, ఇతర అర్జీలు మొత్తం 163 వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్‌కుమార్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలో ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. సోమవారం జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలను రాశారు. ఓపెన్‌ పదోతరగతిలో 526 మందికి గాను 465 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఓపెన్‌ ఇంటర్‌కు 926 మందికి 812 మంది హాజరుకావడంతో 114 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యాశాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

ప్రారంభమైన వెల్ఫేర్‌ వీక్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం వెల్ఫేర్‌ వీక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీలు, అన్ని వసతి గృహాలను జిల్లా నోడల్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా వంటశాలలు, శానిటేషన్‌, సమగ్ర శుభ్రత ప్రమాణాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర గోరక్ష కో కన్వీనర్‌ గ్యాదరి రాజారాం ధర్మ యోధ అవార్డు పొందినట్లు భారత్‌ నేషనలిస్ట్‌ ఫోరం వ్యవస్థాపకుడు కొత్తకొండ రాజు, ప్రధాన కార్యదర్శి బోండ్ల మల్లికార్జున్‌ సోమవారం తెలిపారు. సద్గురు ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో సువర్ణ భారతి గోశాలలో భారత్‌ నేషనలిస్ట్‌ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ చేతుల మీదుగా ధర్మ యోధ అవార్డుతో గ్యాదరి రాజారాంను సన్మానించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement