
వైభవం
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025
నాగ పంచమి
ఆలయాల వద్ద భక్తుల సందడి
జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల
ఆవరణలోని పుట్టల్లో పాలు పోశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలు సంతోషంగా
ఉండాలని కోరుకుంటూ నాగదేవతలకు నైవేద్యాలు
సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కోటిపడగల సంతాన నాగదేవత, ఉమాపార్థీఽశ్వర కోటిలింగాల, తదితర ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
న్యూస్‌రీల్