
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మలేరియా యూనిట్, బస్తీ దవాఖానను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వేసే వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సరిత, డాక్టర్ దివ్యశ్రీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రసవాల సంఖ్య పెంచండి
నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ అన్నారు. రాజగోపాల్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసి ల్యాబ్, మెడికల్ స్టోర్, ఓపీ, సిబ్బంది వివరాలు సేకరించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
అంకితభావంతో విధులు
నిర్వహించాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్