
‘భగీరథ’ లీకై ంది.. తోట చెరువైంది
● రైతులకు తీరని నష్టం ● గౌరారం వద్ద ఘటన..
వర్గల్(గజ్వేల్): భగీరథ పైపులైన్ లీకై ంది. నీరు వరదలా ప్రవహించింది. పంట చేన్లు చెరువులా మారింది. వర్గల్ మండలం గౌరారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ ఘటనతో పొలంలో మోకాలు లోతు నీరు నిలిచి కాత దశలో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి గౌరారం రాజీవ్ రహదారి వ్యవసాయ క్షేత్రాల సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ అయింది. నీరంతా పక్కనే ఉన్న కూరగాయ పందిరి తోటల్లోకి, పంట పొలాల్లోకి చేరింది. రైతులు వెళ్లి చూడగా పంట చేన్లలో మోకాలు లోతు నీరు ఉన్నట్లు గురించారు. పొలం లీజుకు తీసుకుని రూ.లక్షకు పైగా పెట్టుబడితో రెండెకరాల పొట్లకాయ తోటను, 10 గుంటల్లో మొక్కజొన్న స్వీట్‌కార్న్ సాగుచేసినట్లు బాధిత రైతు చిందం స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కాయ దిగుబడి మొదలైన తరుణంలో ఊహించని వరద నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పలు పంటపొలాలు సైతం నీట మునగడంతో పలువురికి నష్టం జరిగింది. కాగా మల్లన్న సాగర్ నీటి మళ్లింపు నేపథ్యంలో పైపులైన్ లీకేజీ ఏర్పడిందని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని గజ్వేల్ మిషన్ భగీరథ డీఈ రాజు పేర్కొన్నారు.