
30న మెగా జాబ్ డ్రైవ్
సిద్దిపేట ఎడ్యుకేషన్: మెగా జాబ్ డ్రైవ్ ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్‌విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీ, కలెక్టర్ ఆధ్వర్యంలో టెక్ బీ పోగ్రాం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉదయం 10గంటలకు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్‌లో 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు హెచ్‌సీఎల్ ప్రతినిధులను 7569177071, 7981834205లలో సంప్రదించాలన్నారు.
26న విద్యార్థులకు
సైకిళ్ల పంపిణీ
హుస్నాబాద్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 26న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకుని మోదీ గిఫ్ట్ పేరిట 20 వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 400 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఫిలిం సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల
అక్రమ అరెస్టులు తగవు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గుడికందుల రవి అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పిలుపునిస్తే, కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో గురువారం జిల్లా కేంద్రంలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యిందన్నారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు హేమంత్, రవి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించండి
సిద్దిపేటరూరల్: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పీఆర్‌సీని ప్రకటించి, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అజీజ్, మల్లయ్య, శ్రీనివాస్‌గౌడ్, విష్టువర్థన్, శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయండి
కొండపాక(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలని, పనులు పారదర్శకంగా చేపట్టాలని చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ సూచించారు. మండల పరిధిలోని సిర్సనగండ్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చైతన్య కుమార్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా లోపించకుండా చూసుకోవాలన్నారు. గ్రామానికి 65 ఇళ్ల మంజూరు కావడం అందులో 54 మంది నిర్మాణ పనులు మొదలు పెట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పీడీ దామోదర్‌రావు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, కార్యదర్శి స్వాతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

30న మెగా జాబ్ డ్రైవ్