ఇక డుమ్మాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక డుమ్మాలకు చెక్‌

Jun 19 2025 7:58 AM | Updated on Jun 19 2025 7:58 AM

ఇక డు

ఇక డుమ్మాలకు చెక్‌

సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడు జిల్లా ప్రజా పరిషత్‌లు,73 మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ సంబంధిత మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల పాలక వర్గాల గడువు గతేడాది జూలై 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు జిల్లా పరిషత్‌ ప్రత్యేక అధికారులుగా, మండల పరిషత్‌ ప్రత్యేక అధికారులుగా పలువురు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్‌లలో పలువురు అధికారులు సమయ పాలన పాటించడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యా దులు అందాయి. దీంతో బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ మెషీన్లు బిగించి సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో ఆఫ్‌లైన్‌

గతంలో పలు కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు ఆఫ్‌లైన్‌లో ఉండేది. అది సక్రమంగా పనిచేయకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి. దీంతో సిబ్బంది విధుల పట్ల జాప్యం వహించడం, తరచుగా డుమ్మా కొట్టడం, ఇంటికి వెళ్లడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందలేదు. వీటికి చెక్‌ పెట్టేందుకు బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

సిద్దిపేట జెడ్పీలో బయోమెట్రిక్‌ మెషీన్‌లో హాజరు నమోదు చేసుకుంటున్న సిబ్బంది

వారం రోజుల్లో

అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో...

మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో ఫేస్‌ రికగ్నిషన్‌, బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తాం. వారం రోజుల్లో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో మెషీన్లు బిగించి అమలు చేయనున్నాం. ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నాం. ఈ నెల 18 నుంచి జిల్లా పరిషత్‌లో అమలు చేయడం ప్రారంభించాం.

– రమేశ్‌, సీఈఓ, జిల్లా ప్రజాపరిషత్‌, సిద్దిపేట

ఉద్యోగుల వివరాల సేకరణ

బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ మెషీన్‌లో ఉద్యోగులను గుర్తించేందుకు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల హోదా, ఆధార్‌ నంబర్‌, ఉద్యోగుల క్రమసంఖ్య తదితర వివరాలను బయోమెట్రిక్‌లో నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్‌ హాజరుతో ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎంతమంది సిబ్బంది హాజరయ్యారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంకు తెలియనుంది.

జిల్లా మండల పరిషత్‌లు

సిద్దిపేట 26

సంగారెడ్డి 26

మెదక్‌ 21

ఉద్యోగుల నుంచి ఆధార్‌నంబర్‌, హోదా వివరాల సేకరణ

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడు

జిల్లా పరిషత్‌లు, 73 మండల పరిషత్‌లు

ఇక డుమ్మాలకు చెక్‌1
1/1

ఇక డుమ్మాలకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement