విధులపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

విధులపై అవగాహన అవసరం

Nov 24 2026 4:16 PM | Updated on Nov 24 2026 4:16 PM

ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

సంగారెడ్డి జోన్‌: ప్రాక్టికల్‌ శిక్షణలో భాగంగా ఆరు నెలల పాటు పోలీసు శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు, విధులు, బాధ్యతలపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ ట్రైనీ డీఎస్పీలకు సూచించారు. పది నెలల ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని, ఆరు నెలల ప్రాక్టికల్‌ శిక్షణ నిమిత్తం జిల్లాకు నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు మహేందర్‌, ప్రమోద్‌, ప్రతిభ, మహేశ్వరీ వచ్చారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో నేర్చుకునే అంశాలు భవిష్యత్తులో వారి సర్వీసుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించిన విధులు, వరకట్న మరణాలు, ట్రాఫిక్‌ నిర్వహణ వంటి గ్రేవ్‌ కేసుల్లో దర్యాప్తు విధానం, కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిపాలనా అంశాలపై పూర్తి అవగాహన సాధించాలని సూచించారు. భవిష్యత్తులో సమర్థవంతమైన పోలీసు అధికారులుగా ఎదిగేందుకు ఆరు నెలల శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement