సిద్దిపేటరూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కె.హైమావతి మెడికల్ ఆఫీసర్, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నారాయణరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. ఎలాంటి వ్యాధుల బారిన పడినా ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. వానాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున మందులు, పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
సిద్దిపేట కలెక్టర్ హైమావతి


