నారాయణఖేడ్: పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యాభివృద్ధిలో పేద విద్యార్థులు సైతం ముందుండాలనే సంకల్పంతో ఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆమ్‌నెట్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ సంస్థ బుధవారం ఉచితంగా పది లాప్‌ట్యాప్‌లు అందజేసింది. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ సీఈఓ కృష్ణారెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి, సూర్యదేవర, హర్షిత్, మల్లేశ్వరి, అభిలాష్, నాగరాజు, అరుణ, మాధవి,సూర్య మాట్లాడారు. మారుమూల ప్రాంతంలోని ఖేడ్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు లాప్‌ట్యాప్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్మదకిశోర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, రాజశేఖర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


