మాక్‌ పోలింగ్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మాక్‌ పోలింగ్‌లో ప్రతిభ

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

విద్యార్థికి విద్యాశాఖ

డైరెక్టర్‌ అభినందనలు

చిన్నశంకరంపేట(మెదక్‌): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిని బి.అభిజ్ఞ మోడల్‌ ఐక్యరాజ్య సమితి(యునెటెడ్‌ నేషన్స్‌) సమావేశంలో ఉత్తమ ప్రతిభ చాటింది. దీంతో విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ కార్యాయంలో విద్యార్థికి ఉత్తమ ప్రతినిధిగా ప్రశంసా పత్రం అందించి అభినందించారు. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన మాడల్‌ ఐక్య రాజ్యసమితిలో ఎంఎన్‌ దేశపు ప్రతినిధిగా పాల్గొని ప్రతిభ చాటింది. గైడ్‌ టీచర్‌ లింగమయ్య పాల్గొన్నట్లు మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వాణికుమారి తెలిపారు.

పెరుగురాజన్న కుంటలో సర్వే..

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): మండలంలోని తీగలకుంటపల్లి గ్రామంలో ఇటీవల కబ్జా కోరల్లో రాజన్నకుంట అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన వార్త కథనానికి ఇరిగేషన్‌ అధికారులు స్పందించారు. బుధవారం ఎట్టకేలకు కుంటలో పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు.

పాత పెన్షన్‌ వర్తింపజేయాలి

పోరాట సమితి డిమాండ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ అమలు చేయాలని పాత పెన్షన్‌ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాత పెన్షన్‌ అమలు చేయడం హర్షనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4,57/5 మెమోల ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా డీఎస్సీ 2003 నోటిఫికేషన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వెలువడిందన్నారు. ఒకే నోటిఫికేషన్‌లో నియామకమైన టీచర్లకు రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా పెన్షన్‌ అమలు చేయడం అన్యాయమని తెలిపారు. ఏపీలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాత పెన్షన్‌ తక్షణమే అమలు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎండు గంజాయి పట్టివేత

ఇద్దరి రిమాండ్‌

పటాన్‌చెరు టౌన్‌: అమీన్‌పూర్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీహెచ్‌ఈఎల్‌ బస్టాప్‌ సమీపంలో చేపట్టిన తనిఖీల్లో 1.56 కిలోల ఎండు గంజాయిని, రెండు ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎస్‌కే రూహిల్‌ అమీన్‌, ఎస్‌కే ఇస్లాంను అదుపులోకి తీసుకోగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.ఈ దాడుల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ అనంత రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌, కానిస్టేబుళ్లు రవి నాయక్‌, నెహ్రూ నాయక్‌, శేఖర్‌, సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

నలుగురిపై కేసు నమోదు

హుస్నాబాద్‌రూరల్‌: మండలంలోని మహ్మదాపూర్‌ మాజీ సర్పంచ్‌ పిట్టల సంపత్‌ ఆత్మహత్యకు కారకులైన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. మాజీ సర్పంచ్‌ రాసిన సూసైడ్‌ నోటులోని సర్పంచ్‌ జిల్లెల తిరుమల, ఉపసర్పంచ్‌ కత్తుల సమ్మరాజు, వార్డు సభ్యుడు తిరుపతి , పంచాయతీ కార్యదర్శి హరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

అక్రమంగా మట్టిని

తరలిస్తున్న టిప్పర్‌ సీజ్‌

కొమురవెల్లి(సిద్దిపేట): అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నుంచి మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్‌ను సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ దివ్య బుధవారం తెలిపారు. కొమురవెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని గంగరాయకుంటలోనుంచి కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆర్‌ఐ నర్సింహులు అక్కడికి చేరుకొని టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా మట్టి తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement