అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

కొమురవెల్లి(సిద్దిపేట): చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సిద్దిపేట కమిషనరేట్‌లో సీపీ రష్మీ పెరుమాళ్‌ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 30వ తేదీన కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన సార్ల సురేశ్‌ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎస్‌ఐ మహేశ్‌ గుర్జకుంట కమాన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా మెదక్‌ జిల్లా కుల్చారం స్టేషన్‌ పరిధిలో మహిళ పుస్తెలతాడు, ఫోన్‌, నిజామాబాద్‌ జిల్లా జాక్రాన్‌పల్లి పీఎస్‌ పరిధిలో మొబైల్‌ షాప్‌లో లాప్‌ట్యాప్‌, సీసీ కెమెరా మానిటర్‌, కొమురవెల్లి పీఎస్‌ పరిధిలో ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులు డొంగరి రాజు, పొట్ట ప్రవీణ్‌, బొద్దుల శ్రీనాధ్‌ను అరెస్టు చేశారు. కాగా వారి నుంచి రూ.7లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కుల్చారానికి సంబంధించిన పుస్తెలతాడును నిజామాబాద్‌లోని ఎఫ్‌ఈడీ బ్యాంకులో కుదువబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కేసు ఛే దించిన చేర్యాల సీఐ రమేశ్‌, ఎస్‌ఐ మహేశ్‌, రవీందర్‌, తిరుపతిరెడ్డిలను సీపీ అభినందించారు.

సుమారు రూ .7లక్షల సొత్తు స్వాధీనం

కేసు వివరాలు వెల్లడించిన సీపీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement