విదేశీ మద్యం బాటిళ్ల ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

విదేశీ మద్యం బాటిళ్ల ధ్వంసం

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

నర్సాపూర్‌: పట్టుబడిన విదేశీ మద్యం బాటిళ్లను బుధవారం ఎకై ్సజ్‌ అధికారులు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన కస్టమ్స్‌ అధికారులు గతంలో పలు కేసుల్లో పట్టుకున్న విదేశీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేయాలని మండలంలోని కాగజ్‌మద్దూర్‌ గ్రామ పరిధిలో ఉన్న మిరిడి బయో కెమికల్స్‌ కంపెనీ ప్రతినిధులకు అప్పగించారు. కాగా ఆ బాటిళ్లను కంపెనీ ఉద్యోగులు ధ్వంసం చేయకుండా అందులో నుంచి కొన్ని నొక్కేసి, అమ్ముకున్నారు. ఇదిలా ఉండగా.. బాటిళ్ల మాయంపై ఎకై ్సజ్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కంపెనీ ఉద్యోగుల నుంచి 783 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ బాటిళ్లను ఎకై ్సజ్‌ అసిస్టెంటు కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో నర్సాపూర్‌ మున్సిపాలిటీకి చెందిన డంప్‌యార్డులో ధ్వంసం చేశామని స్థానిక సీఐ గులాం ముస్తాఫా తెలిపారు. ట్రైనీ అధికారి సతీశ్‌కుమార్‌, ఎకై ్సజ్‌ ఎస్‌ఐలు హజీజ్‌ హమద్‌, అరుణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement