నర్సాపూర్ రూరల్: పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నర్సాపూర్ డాన్‌బాస్కో స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా మండలంలోని గొల్లపల్లిలో బుధవారం గ్రామస్తులు బస్సును అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ... స్కూల్ డ్రైవర్‌కు లైసెన్స్ లేకున్నా తమ పిల్లలను బస్సులో తీసుకెళ్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన చదువు చదివించేందుకు ప్రతినెలా వేల రూపాయల ఫీజులు చెల్లించడంతోపాటు, బస్సుకు అద్దెలు చెల్లిస్తున్నామన్నారు. స్కూల్ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా లైసెన్స్ లేని డ్రైవర్‌ను పంపి మా పిల్లల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై స్కూల్ ఎండీ నర్సిరెడ్డిని వివరణ కోరగా... రెగ్యులర్ డ్రైవర్ విధులకు రాకపోవడంతో తాత్కాలికంగా ఒకరోజు కోసం డ్రైవర్ పంపించామని, లైసెన్స్ సంగతి మాకు గ్రామస్తులు అడ్డుకున్న తర్వాత తెలిసిందన్నారు.
లైసెన్స్ లేకుండా
స్కూలు బస్సు నడిపిన డ్రైవర్
అడ్డుకున్న గొల్లపల్లి గ్రామస్తులు


