నర్సాపూర్: మత్తుకు దూరంగా ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక డి అడిక్షన్ సెంటరులోని బాధితులకు క్రీడా సామగ్రి పంపిణీ చేసి మాట్లాడారు. మత్తును విడిచిపెట్టి కుటుంబ సభ్యుల అండతో సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. క్రీడలు మానసిక ప్రశాంతతను కల్గించి వ్యసనాల నుంచి దూరంగా ఉండేందుకు దోహదపడతాయని చెప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారిన వ్యక్తులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ద్వారా కొత్త జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ బాధ్యతగా ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, స్థానిక ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, డీ అడిక్షన్ సెంటరు సిబ్బంది ఉన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు


