న్యూస్‌రీల్
ఎమ్మార్పీ కంటే రూ.300 వరకు అధికం కొందరు డీలర్ల ఇష్టారాజ్యం బిల్లు చూపితే చర్యలంటున్న అధికారులు బిల్లు అడిగితే స్టాక్ లేదంటున్న డీలర్లు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రాజకీయాల్లో
గెలుపోటములు సహజమే
ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కలిశారు. 18, 21, 22వ వార్డుల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన నసీర్, సిఫాలియా, ముర్తుజలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తంజీం, బీఆర్‌ఎస్ నాయకులు మిథున్‌రాజ్ పాల్గొన్నారు.
పీఏసీఎస్ ఎరువుల
వివాదంపై విచారణ
పుల్‌కల్(అందోల్): పుల్‌కల్ వ్యవసాయ సహకార సంఘం డీఏపీ ఎరువుల పంపిణీలో జరిగిన వివాదంపై మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. సొసైటీలో 100 డీఏపీ ఎరువుల బస్తాలు చైర్మన్, అతని అనుయాయులే తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఎరువుల వివాదంపై జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. మంగళవారం దీంతో జోగిపేట వ్యవసాయశాఖ ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయశాఖ అధికారి చైతన్య పీఏసీఎస్ సొసైటీలో విచారణ చేసి రైతుల నుంచి చైర్మన్ అనంతరావు కులకర్ణి నుంచి వివరణ తీసుకున్నారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతామని ఏడీఏ రమాదేవి తెలిపారు.
రేపటి నుంచి అమలు
వర్గల్(గజ్వేల్): విశేషమైన భక్తజనాదరణ కలిగిన నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో ఆలయ వేళలు మారుతున్నాయి. భక్తులకు నిరీక్షణ లేకుండా ఇక రోజంతా శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. అదేవిధంగా పూజాకార్యక్రమ వేళలోనూ మార్పులు చేశారు. భక్తుల దర్శనం కోసం ఆలయం ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు తెరిచిఉంటుంది. శని, ఆదివారాల్లో ఎలాంటి విరామం లేకుండా ఉదయం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంటుంది. పూజా కార్యక్రమాల్లోనూ మార్పు చేశారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం గురువారం నుంచి నూతన వేళలు అమలులోకి వస్తాయని ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు.. జిల్లా స్థాయిలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు కలిసి సంయుక్త తనిఖీలు.. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు.. క్లస్టర్ స్థాయిలో ఏఈఓలు, మండల స్థాయిలో ఏఓల ప్రత్యక్ష పర్యవేక్షణలు.. ఇవేవీ.. డీఏపీ ఎరువు అధిక ధర దోపిడీ చెక్ పెట్టలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో ఈ ఎరువు కొరతను ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు యథేచ్ఛగా అధిక ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ఎమ్మార్పీ కంటే రూ.300 వరకు ఎక్కువగా విక్రయిస్తుండటం గమనార్హం.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
డీఏపీ ఎరువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఎమ్మార్పీకంటే రూ.వంద నుంచి రూ.మూడు వందల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఎరువు ఎమ్మార్పి రూ.1,350 ఉంటే.. ఏకంగా 1,550 వరకు విక్రయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే రైతులకు అసలు స్టాకే లేదని బుకాయిస్తున్నారు. మరికొందరు డీలర్లు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులు ఆయా డీలర్ల వద్దకు వెళితే డీఏపీ స్టాక్ లేదని చెబుతున్నారు. అధిక ధర అయి ఇస్తామని చెబితే మాత్రం ఈ ఎరువును విక్రయిస్తున్నారు. అసలే కొరత ఉన్న నేపథ్యంలో రైతులు బిల్లులు అడిగే పరిస్థితి లేదు. బిల్లులు (ప్రూఫ్) ఉంటేనే చర్యలు తీసుకుంటామని సంబందిత అధికారులు చెబుతున్నారు. బిల్లు అడిగిన రైతులకు ఈ ఎరువు స్టాక్ లేదని డీలర్లు దాటవేస్తుండటం పరిపాటైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలు చెల్లించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
వ్యవసాయశాఖ, పోలీసుశాఖలు సంయుక్తంగా ఎరువుల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు చాలా చోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. అధిక ధరలకు డీఏపీ విక్రయిస్తున్న ఒక్క డీలరుపై ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. అక్కడక్కడ 6 (ఏ) కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించిన కేసు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సాధారణంగా బస్తాపై ఎమ్మార్పీ కంటే రూ.పది, రూ.20 అంటే రైతులు మంచి మనసుతో పోనీలే అనుకుని చెల్లించేస్తారు. కానీ ఏకంగా రూ.వంద నుంచి రూ.మూడు వందల వరకు అధికంగా దోపిడీ జరుగుతుండటంతో
జిల్లాలో ఈ వానాకాలం సీజనులో 7.62 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ సీజనుకు సంబందించి 18,395 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం అని వ్యవసాయశాఖ అంచాన వేసింది. రానున్న మూడు నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఏ నెలలో ఎంత అవసరం అనే దానిపై ప్రణాళిక రూపొందించింది.
బీఆర్‌ఎస్‌లో చేరికలు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది యువకు లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల విక్రయాల్లో దోపిడీ
చర్యలు తీసుకుంటాం
డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. ఎక్కువ ధరకు విక్రయించినట్లు ప్రూఫ్ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మా శాఖ ఆధ్వర్యంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు ఎనిమిది మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. కొందరిపై 6(ఏ) కేసులు కూడా పెట్టాం.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


