నెలలో నిధులు మంజూరు చేస్తా | - | Sakshi
Sakshi News home page

నెలలో నిధులు మంజూరు చేస్తా

Jun 24 2026 9:16 AM | Updated on Jun 24 2026 9:16 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి

పటాన్‌చెరు: బీరంగూడ డివిజన్‌ పరిధిలోని ఇక్రిసాట్‌ ఫేజ్‌ 1 కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. మంగళవారం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా అంతర్గత సీసీ రోడ్లు, నూతన డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లోగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తుమ్మల పాండు రంగారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నరసింహగౌడ్‌, అమీన్‌పూర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, ఈఈ సురేష్‌, జలమండలి జీఎం శ్రీనివాస్‌ రెడ్డి, డీఈ వెంకటరమణ, డీజీఎం శివకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement