పట్టణ సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

పట్టణ సమస్యలు పరిష్కరించండి

Jun 24 2026 9:16 AM | Updated on Jun 24 2026 9:16 AM

సంగారెడ్డి: పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ వార్డు సభ్యులు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కూన వనిత దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన 16 అంశాలతో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాను న్న వర్షాకాలాన్ని అంచనా వేసుకొని పట్టణంలోని పలు వార్డులలో బురదమయం కాకుండా రూ.20 లక్షల నిధులు కేటాయించారు. అలాగే డంప్‌ యార్డ్‌ అభివృద్ధికి నిధులను కేటాయించి ఆమోదించారు. అలాగే పట్టణంలోని అన్ని సమస్యలను దశలవారీగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ షఫీ హఫీజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, డీఈ రఘు, టీపీఓ విశాల్‌, ఆర్‌ఐ స్వాతి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement