మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Jun 23 2026 7:55 AM | Updated on Jun 23 2026 7:55 AM

మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026 ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026
ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

సంగారెడ్డి జోన్‌: జిల్లాలోని యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల వాల్‌ పోస్టర్‌ ను సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. యాంటీ డ్రగ్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ నరేందర్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ సదా నాగరాజు, ఎస్సై కావేరి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement