ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ప్రత్యేక శిక్షణ
జోగిపేట(అందోల్): పట్టణ సమీపంలోని లక్ష్మీదేవి గార్డెన్స్‌లో ఈనెల 23న ఉదయం 11 గంటలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందోల్ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తప్పనిసరిగా పాల్గొని అవగాహన పెంచుకోవాలని మంత్రి కార్యాలయం కోరింది.


